 
															అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి
దుద్యాల్: తండాల్లో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎక్కచెరువు తండాలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తండాలను విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేయిస్తోందన్నారు. కార్యక్రమంలో కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం చైర్మన్ జయరాములు, నాయకులు కృష్ణ, శివ చౌహాన్, రాంచందర్, రమేశ్, శెట్టి, నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
