తాండూరులో డ్రోన్ల కలకలం | - | Sakshi
Sakshi News home page

తాండూరులో డ్రోన్ల కలకలం

Oct 26 2025 9:19 AM | Updated on Oct 26 2025 9:19 AM

తాండూ

తాండూరులో డ్రోన్ల కలకలం

‘పాలమూరు’ నివాసానికి మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ

తాండూరు టౌన్‌: పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా ఆకాశంలో శనివారం రాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మిణుకు మిణుకుమనే ఎర్రని లైటు వెలుగుతూ సాయిపూర్‌, ఇందిరానగర్‌, మల్‌రెడ్డిపల్లి, శివాజీ చౌక్‌ల మీదుగా ఆకాశంలో తిరిగాయి. వీటిని పలువురు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. శుక్రవారం రాత్రి సైతం పెద్దేముల్‌ మండలంలోని పెద్దేముల్‌ తండా, ఇందూర్‌, నర్సాపూర్‌ తదితర గ్రామాల్లో కూడా డ్రోన్లు తిరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ విషయమై పట్టణ ీసీఐ సంతోశ్‌కుమార్‌ను వివరణ కోరగా డ్రోన్లు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా రాత్రి వేళ డ్రోన్లు చక్కర్లు కొట్టడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌ రెడ్డి నివాసానికి హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం వచ్చారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దత్తాత్రేయను విష్ణువర్ధన్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, నర్సింహయాదవ్‌, మోహన్‌ సింగ్‌, సుధాకర్‌ అప్ప, బల్‌వంత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, రాజు, బోయ అశోక్‌, అనిల్‌ కుమార్‌ గౌడ్‌, రాజు నాయక్‌, కుమ్మరి మహేశ్‌, ప్రతాప్‌ రెడ్డి, శ్యాంసుందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ

సామాజిక బాధ్యత

జైళ్లశాఖ డీజీ డాక్టర్‌ సౌమ్యమిశ్రా

కుషాయిగూడ: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని తెలంగాణ జైళ్లశాఖ డీజీ డాక్టర్‌ సౌమ్యమిశ్రా అన్నారు. శనివారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విధిగా ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఖైదీల వ్యవసాయక్షేత్రంలోని చెరువులో చేప పిల్లలను వదిలారు. తేనెటీగలు, చేపల పెంపకం, సీడ్‌ బాల్‌ పంపిణి పర్యావరణాన్ని సమతుల్యాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. మొక్కల పెంపకంతో పాటు పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని డీజీ అభినందించారు. కార్యక్రమంలో అర్బన్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ డైరక్టర్‌ జి. అన్నపూర్ణ, జిల్లా అటవీశాఖ అధికారి ఎం. వేణుమాధవరావు, ఉద్యానశాఖ జాయింట్‌ డైరక్టర్‌ బాబు, కాప్రా సర్కిల్‌ డీసీ జగన్‌, సుకీర్తి, విష్ణువర్థన్‌రావుతో పాటుగా జైళ్లశాఖ ఐజీ ఎన్‌. మురళీబాబు, డీఐజీలు డాక్టర్‌ డి. శ్రీనివాస్‌, సంపత్‌, చర్లపల్లి జైల్‌, ఓపెన్‌ జైల్‌ పర్యవేక్షణాధికారులు ఎన్‌. శివకుమార్‌గౌడ్‌, డి. కాళిదాసు, సీకా ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీమాన్‌రెడ్డి పాల్గొన్నారు.

తాండూరులో డ్రోన్ల కలకలం 1
1/1

తాండూరులో డ్రోన్ల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement