 
															కష్టపడి చదివితే భవిష్యత్ మీదే
● తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
● ఘనంగా శాలివాహన డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే
తాండూరు టౌన్: పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థుల ఫ్రెషర్స్‌డే వేడుకలు శనివారం స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉల్లాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ రోజు కష్టపడితే భవిష్యత్ అంతా మీదే అవుతుందన్నారు. కొన్ని సుఖాలను త్యాగం చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారన్నారు. ఇష్టపడి చదువుతూ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా పోటీ పరీక్షలు రాయాల్సి ఉన్నందున, ఇప్పటి నుంచే వాటిపై దృష్టి సారించాలన్నారు. వ్యసనాలకు బానిసలు కాకుండా, నైతిక విలువలను పాటిస్తూ విజయ తీరాల వైపు దూసుకెళ్లాలన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక, సంప్రదాయ, జానపద, వెస్ట్రన్ నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మాణిక్యం, ప్రిన్సిపాల్ శరత్‌చంద్ర, డైరెక్టర్లు సుధాకర్, మల్లేశం, బసంత్, రాధమ్మ, అకాడమిక్ డైరెక్టర్ సిద్ధిలింగయ్య, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 
							కష్టపడి చదివితే భవిష్యత్ మీదే

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
