 
															ముగిసిన జోనల్ స్థాయి ఖోఖో టోర్నీ
షాద్‌నగర్: పట్టణంలోని మరియారాణి పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ జోనల్ స్థాయి ఖోఖో టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ పోటీల్లో నియోజకవర్గ పరిధి కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ,నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థాయిలో కొందుర్గు, ద్వితీయంగా ఫరూఖ్‌నగర్ జట్టు, అండర్ 17లో తొలి స్థానంలో కేశంపేట,ద్వితీయంలో ఫరూఖ్‌నగర్, 14 బాలికల విభాగంలో మొదటి స్థానంలో ఫరూఖ్‌నగర్, రెండో స్థాయిలో చౌదరిగూడ, 17 బాలికల విభాగంలో ప్రథమంగా ఫరూఖ్‌నగర్, ద్వితీయంగా కొత్తూరు జట్టు నిలిచిందని ఎంఈఓ మనోహర్, ఫిజికల్‌డైరెక్టర్ బాలయ్య తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
