 
															భార్య కాపురానికి రావడం లేదని..
శంకర్‌పల్లి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ భర్త.. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండల పరిధి ఎల్వర్తిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివ కుమార్(22) డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. మూడేళ్ల క్రితం మండల పరిధి కొజ్జగూడెంకి చెందిన శిరీషతో వివాహం అయింది. వారికి ఏడాది వయసున్న కూతురు ఉంది. ఏడాది క్రితం కాన్పుకోసం పుట్టింటికి వెళ్లిన శిరీష.. తిరిగి రావడం లేదు. పలుమార్లు రావాలని కోరినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇదే విషయమై తాజాగా సోమవారం అత్తగారింటికి వెళ్లిన శివ.. అక్కడ భార్య, అత్తమామలతో గొడవ పడ్డాడు. అనంతరం సొంతూరుకు చేరుకొని, మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆతహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అతని తల్లి.. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి యువకున్ని కాపాడే యత్నం చేసింది. తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా మృతుడు గతంలో భూమి అమ్మనివ్వడం లేదన్న కోపంతో.. నాయనమ్మను హత్య చేసి, జైలు జీవితం గడిపాడని, ఇదే విషయం తరచూ ఇంట్లో వారితో గొడవపడుతున్నట్లు సమాచారం.
భర్త బలవన్మరణం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
