 
															లక్ష్యం.. లక్ష మెట్రిక్ టన్నులు
అనంతగిరి: వానాకాలం సీజన్‌లో లక్షా 15 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాలని అంచనాలు వేసినట్లు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 135 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొ న్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ 2025 – 26 ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రల వద్ద పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించనునున్నట్లు తెలిపారు. ధాన్యం తెచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి సెంటర్‌లో మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలన్నారు.
ఎప్పటికప్పుడు మిల్లుకు..
సన్న ధాన్యం, దొడ్డు ధాన్యంకు వేరువేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. సన్నాలు నింపుకొనే గోనె సంచులపై శ్రీఎస్ఙ్ అనే అక్షరాన్ని తప్పనిసరిగా ముద్రించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీలలో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ గ్రేడ్ వరికి రూ.2,389లు, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధరను నిర్ధారించామని పేర్కొన్నారు. అలాగే సన్నాలకు క్వింటాలుకు రూ.500 చొప్పున అదనంగా బోనస్ చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, మేనేజర్ మోహన్ కృష్ణ, వ్యవసాయ అధికారి రాజారత్నం, సహకార అధికారి నాగార్జున, డీసీఎంఎస్ అధికారి శ్యాంసుందర్, వ్యవసాయ, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
ధాన్యం సేకరణకు సన్నాహాలు
135 కేంద్రాల్లో కొనుగోళ్లు
అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశం
భూ సమస్యలు
పరిష్కరించాలి
దుద్యాల్: భూ భారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధి హస్నాబాద్‌లో ఆయన పర్యటించారు. 27 సాదా బైనామా అర్జీలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. భూ భారతి, ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులో అందిన భూ సమస్యలకు సంబంధించి అందిన అర్జీలకు త్వరగా పరిష్కార మార్గం చూపాలని, ఇందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్ కిషన్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్ కుమార్, గ్రామ పాలన అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
