 
															బస్వరాజ్‌కు ఘన సన్మానం
యాచారం: వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి బుధవారం నగరంలోని తెలంగాణ ప్రభుత్వ పునరావస, పునరాశ్రయ అధికారిక సంస్థ (అథారిటీ)కు వెళ్లారు. యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 900 మంది రైతులకు చెందిన 2,211 ఎకరాల ఫార్మాసిటీ పరిహారాన్ని బీఆర్‌ఎస్ సర్కార్ అథారిటీలో జమ చేసి, భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసింది. దీంతో రైతులు ఏళ్లుగా ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదని, తిరిగి తమ రికార్డులు మార్చాలని హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం జమ చేసిన పరిహారాన్ని తీసుకునే విషయంలో మీ అభ్యంతరాలేంటి అని అథారిటీ నాలుగు గ్రామాల రైతులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులందుకున్న రైతులు అథారిటీకి వెళ్లి పరిహారం వద్దు, భూములివ్వమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఫార్మా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముదిరెడ్డి కోదండరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి అథారిటీకి వెళ్లారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, మెరుగైన పరిహారం అందజేసే విధంగా చూడాలని అథారిటీకి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు ఈనెల చివరి వారంలో రైతులు వచ్చే అవకాశం ఉందని, వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
