
కార్తీకం.. ఆకాశ దీపం
కొడంగల్: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన పురోహితుడు జయతీర్థాచారీ మంగళవారం కార్తీక ఆకాశ దీపాన్ని వెలిగించారు. దీపావళి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించడం ఆచారంగా తెలిపారు. అలాగే ఆకాశ దీపాన్ని వెలిగించి ఇంటి పైన వేలాడదీయడం ఆనవాయితీ అన్నారు. కొందరు ఆకాశ దీపాలను వెలిగించి గాలికి వదిలేస్తారు. అవి పైకి ఎగురుతూ కనువిందు చేస్తాయి.
అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
108 జిల్లా కోఆర్డినేటర్ అబ్దుల్ రహీం
బంట్వారం: అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు 108 అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ అబ్దుల్ రహీం సూచించారు. మంగళవారం బంట్వారం పీహెచ్‌సీలోని అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, అత్యవసర మెడికల్ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితుల నుంచి 108కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలని సిబ్బందికి సూ చించారు. మొదటగా ప్రథమ చికిత్స అందించి అందుబాటులోని ఆసుపత్రులకు చేర్చా లన్నా రు.108తో పాటు,102, 1962 అత్యవసరసేవ లు అందుబాటులో ఉన్నాయని, వీటిని కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ మోహన్, పైల్‌ట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక
విధానాలకు నిరసనగా..
జూబ్లీహిల్స్ ఉప పోరులో
బషీరాబాద్ యువకుడి పోటీ
బషీరాబాద్: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ల్లో ఎమ్మెల్యే అభ్య ర్థిగా పోటీ చేస్తున్నట్లు బషీరాబాద్ యువకుడు ఎడ్ల సురేష్ తెలిపారు. మంగళవారం మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 19 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కారణంగానే తాను బరిలో నిలవాల్సి వచ్చిందని సురేష్ పేర్కొన్నారు.
దెబ్బతిన్న అలుగు..
సాగునీరు వృథా
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్ సమీపంలోని లంగర్ కుంట అలుగు కొంత మేర దెబ్బతింది. దీంతో దిగువకు నీరు వృథాగా పోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంట నిండి అలుగు పారింది. నీటి ఉధృతికి అలుగు కొంత మేర కోతకు గురైంది. యాసంగి పంటలకు నీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
సిటిజన్ సర్వేను విజయవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని చెప్పారు.

కార్తీకం.. ఆకాశ దీపం

కార్తీకం.. ఆకాశ దీపం

కార్తీకం.. ఆకాశ దీపం