సర్కార్ బడికి.. నాణ్యత లేని సన్న బియ్యం
బొంరాస్‌పేట: రాష్ట్రమంతా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం సర్కార్ బడులకు మాత్రం నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చేది అతిసారకాలం.. ఆహారత పదార్థులు, పాత్రలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణంంలో నాసిరకం బియ్యం సరఫరా అవుతోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. భోజనం చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
అల్పాహారానికి ట్రస్టు సహకారం
హరేరామ హరేకృష్ణ చారిటబుల్ ట్రస్టు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం ఉచితంగా అల్పాహారం సరఫరా చేస్తున్నారు. గతేడాది నుంచి ఇడ్లీ, బోండా, వడ, ఉప్మా, పొంగలి, పులిహోర అందజేస్తున్నారు.
ఆకస్మిక తనిఖీ
మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఎంఈఓ, ఎంపీడీఓ, తహసీల్దారు, ఏఓ తదితరులు ఉంటున్నారు. పాఠశాల స్థాయిలో హెచ్‌ఎం, పంచాయతీ కార్యదర్శి, ఏఏపీసీ చైర్మన్, అంగన్‌వాడీ కార్యకర్తలతో కూడిన కమిటీలున్నాయి. వారి పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని టేకులగడ్డతండా పాఠశాలలో గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ పర్యవేక్షించారు. బియ్యం పరిశీలించిన వెంటనే ఆయన ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వంటపాత్రలు, గదుల శుభ్రతను తెలియజేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
చర్యలు తీసుకుంటాం
నాణ్యత లేని బియ్యం నిల్వపై హెచ్‌ఎంల నుంచి వివరాలు తీసుకున్నాం. పౌష్టిక ఆహారం, పరిశుభ్రతపై ఇటీవల పాఠశాల ఏజెన్సీ మహిళలకు, హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చాం. కమిటీల పర్యవేక్షణకు ఆదేశిస్తాం. ఫుడ్‌పాయిజన్ సంఘటనలు ఎక్కడున్నా అందరిపై చర్యలు తీసుకుంటాం.
–హరిలాల్, ఎంఈఓ, బొంరాస్‌పేట
పురుగులు వస్తున్నాయి
పాఠశాలలో 2018 నుంచి మధ్యాహ్న పథకంలో ఏజెన్సీ మహిళగా పనిచేస్తున్నాను. సన్నబియ్యం సరఫరాతో నాణ్యత ఉంటుందని ఊహించుకుంటే పురుగుల బియ్యం వస్తున్నాయి. నాణ్యమైన సన్నబియ్యాన్ని సరఫరా చేయాలి.
– సోమ్లీబాయి, ఏజెన్సీ మహిళ,
దరికిందితండా
ఉమ్మడి మండలంలో సన్నబియ్యం సరఫరా ఇలా
టేకులగడ్డ తండాలో మధ్యాహ్న భోజన పరిశీలన
నాణ్యతాలోపంపై ఎంఈఓకు వివరించిన గ్రామ పరిపాలన అధికారి
సర్కార్ బడికి.. నాణ్యత లేని సన్న బియ్యం
సర్కార్ బడికి.. నాణ్యత లేని సన్న బియ్యం
సర్కార్ బడికి.. నాణ్యత లేని సన్న బియ్యం


