మొక్కలు నాటుదాం.. భవిష్యత్‌ను కాపాడుదాం
కుల్కచర్ల: మొక్కలు నాటి భవిష్యత్‌ను కాపాడుకుందానమి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌమ్యారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చెల్లాపూర్‌లో బీజేపీ 11 వసంతాల పాలన విజయవంతంగా కొనసాగుతున్నందున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతికి మొక్కలు ఎలా జీవనాధారమో సనాతన ధర్మాన్ని కాపాడడం, శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షించుకోవడం బీజేపీ పాలనలోనే సాధ్యమన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధిస్తుందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు మరింత శ్రమించి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రామకృష్ణ, వెంకటేశ్, మహేశ్, రాంచంద్రయ్య, పి.అంజి, చెన్నయ్య, కృష్ణయ్య, సి.వెంకటయ్య, సి.అంజిలయ్య, బాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి


