
సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ
తాండూరు: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చిన యువకుడు కౌంటర్‌పై ఉంచిన రూ.35వేలు తీసుకొని ఉడాయించిన సంఘటన తాండూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు పట్టణంలోని కొడంగల్ రోడ్డు మార్గంలో తాండూరుకు చెందిన ఓ వ్యాపారి ఒప్పొ స్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. షాప్ చూసుకోవాలని దుకాణంలో పని చేసే యువకుడికి చెప్పి బయటకు వెళ్లాడు. అప్పుడే ఓ వ్యక్తి ఫోన్ కొనేందుకు వచ్చాడు. వచ్చిన వ్యక్తికి రూ.35వేల ఫోన్‌ను విక్రయించాడు. వచ్చిన డబ్బులను క్యాష్ కౌంటర్‌లో పెడదామంటే తాళం వేసి ఉంది. దీంతో అతను కౌంటర్‌పైనే ఒక అరలో డబ్బులను పెట్టి వ్యాపారంపై దృష్టి పెట్టాడు. అప్పుడే ఓ యువకుడు సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చాడు. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ.. ఎవరు లేని సమయం చూసి కౌంటర్‌పై ఉన్న రూ.35వేలను తీసుకొని మెల్లగా షాపులో నుంచి వెళ్లిపోయాడు. కొంత సేపటి తర్వాత షాపులో పని చేస్తున్న వ్యక్తి డబ్బులను చూసుకోగా కనిపించలేదు. దీంతో అతను డబ్బులు ఎత్తుకెళ్లారని గుర్తించి సీసీ కెమెరాలు చెక్ చేశాడు. అందులో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకొనేందుకు వచ్చిన గుర్తు తెలియని యువకుడు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయం గురించి యజమాని వచ్చాక వివరించి చెప్పాడు. ఇద్దరు కలిసి వెళ్లి పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చార్జింగ్ పెట్టుకునేందుకు వచ్చి
రూ.35వేలు అపహరణ