అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. తొలి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం ధారూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గురుదోట్ల గ్రామం నుంచి టేకులపల్లితండా వరకు రూ.3.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, రూ.2.40 కోట్లతో మైలారం నుంచి మైలారం కొత్త తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు, రూ.90 కోట్లతో నాగారం నుంచి వికారాబాద్ వయా మైలారం, తరిగోపుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ కృష్ణయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీడీఓ నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, హన్మంత్‌రెడ్డి, రాములు, మాన్‌సింగ్, విజయభాస్కర్‌రెడ్డి, అశోక్, బుజ్జయ్యగౌడ్, ఎస్‌కే ఆశం, గఫార్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
బంట్వారం: గిరిజన తండాల్లోని అన్ని కాలనీల్లో బీటీ రోడ్లు వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శనివారం కోట్‌పల్లి మండలం మద్దుల్ తండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి తండా వరకు రూ,1.50 కోట్లతో బీటీ రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సన్న బియ్యం పంపిణీని ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
యాలాల: గ్రామాల అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్య మని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అక్కంపల్లి, జంటుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. తూముకు శా శ్వత పరిష్కారం చూపుతామన్నారు.కార్యక్రమంలో యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా నా యకుడు రమేష్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు రామ్య నాయక్, నారాయణరెడ్డి, రమేష్, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ అభివృద్ధికి కృషి
అనంతగిరి: వికారాబాద్ నియోజకవర్గంలో రూ.173 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్ నుంచి పరిగి వరకు రూ.77 కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు మద్గుల్ చిట్టంపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం వికారాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 42మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, ఆర్‌టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల మాజీ చైర్మన్ సత్యనారాయణ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, జాఫర్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు మురళి, వెంకట్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ధారూరులో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది
పరిగి: ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నా రు. శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. 14 నెలల పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను సీఎం త్వరలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, నాయకులు ఆనందం, గోపాల్ పాల్గొన్నారు.


