
ధారూరు: అవార్డులతో సర్పంచులు, కార్యదర్శులు
అనంతగిరి: దేశాభివృద్ధికి పల్లెలు సూచికలుగా మారాయని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చరిత్రాత్మకమైన నిర్ణయాలతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు అవార్డులు రావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు. పల్లెలు పరిశుభ్రంగా పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ నాగరాజు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఐకేపీ ఏపీఎం లక్ష్మయ్య, ఏపీఓ శీను, ఏఎంసీ వైస్‌చైర్మన్ శేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి టీఏ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌లకు సన్మానం
దౌల్తాబాద్: మండల స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికై న ఏడు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ మహి పాల్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమలస్వామి. ఎంపీఓ రవీందర్ తదితరులున్నారు.
27 గ్రామపంచాయతీలకు..
ధారూరు: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డులను సాధించిన 27 జీపీల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులను ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుజాత, ఎంపీడీఓ చంద్రశేఖర్‌లు ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.
అవార్డులతో బాధ్యత పెరిగింది
బంట్వారం: జాతీయ పంచాయతీ అవార్డులతో సర్పంచ్‌లకు మరింత బాధ్యత పెరిగిందని ఎంపీపీ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బంట్వారం మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకుని జాతీయ అవార్డులకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుర్గంచెర్వు మల్లేశం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సంతోష, ఎంపీడీఓ బాలయ్య, ఎంపీఓ విజయ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
పరిగి: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికైన 27 మంది సర్పంచ్‌లను శుక్రవారం ఎమ్మెల్యే సన్మానించి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లోని సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, జెడ్పీటీసీ హరిప్రియ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాజేందర్, ఎంపీడీఓ శేషగిరిషర్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఉత్తమ పంచాయతీలకుజాతీయ అవార్డుల ప్రదానం

దౌల్తాబాద్: సర్పంచ్‌లను సన్మానిస్తున్న అధికారులు

బంట్వారం: ప్రశంసా పత్రాలతో సర్పంచ్‌లు