పదిలో మళ్లీ ఫల్టీ! | - | Sakshi
Sakshi News home page

పదిలో మళ్లీ ఫల్టీ!

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

● పది ఫలితాల్లో 83.93 శాతం ఉత్తీర్ణత ● 19 నుంచి 20కి దిగజారిన జిల్లా ర్యాంకు ● జిల్లాలో బాలికలదే మళ్లీ హవా!

● పది ఫలితాల్లో 83.93 శాతం ఉత్తీర్ణత ● 19 నుంచి 20కి దిగజారిన జిల్లా ర్యాంకు ● జిల్లాలో బాలికలదే మళ్లీ హవా!

ప్రత్యేక తరగతులు.. వంద రోజుల ప్రణాళికలు..

అధికారుల హంగామా.. ఉపాధ్యాయుల ప్రయత్నాలు.. ఏదీ పదిలో ‘ఫలి’ంచలేదు..

గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాలు

సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్‌ బాబు సొంతజిల్లాలో గత ఏడాది కంటే ఓ మెట్టు కిందకు దిగజారాయి. పది ఫలితాల్లో తిరుపతి జిల్లా 20 స్థానంలో నిలిచి అధినేతల పరువు తీశాయి.

జిల్లాపై కొరవడిన సీఎం, విద్యామంత్రి

పర్యవేక్షణ, లోపించిన అధికారులు ప్రణాళికలే ఇందుకు కారణాలుగా నిలిచాయి.

తిరుపతి అర్బన్‌: జిల్లాలో పదో తరగతి ఫలితాలు నిరుత్సాహపరిచాయి. ఫలితాలు గత ఏడాది కంటే మరీ దారుణంగా పడిపోవడంతో నోరు మెదపలేని స్థితిలో అధికారులు త లలు పట్టుకుంటున్నారు. గురువారం విడుదలైన పది ఫలితాల్లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 20వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది 19వ స్థానంలో ఉన్న జిల్లా దారుణంగా 20వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా కనీసం టాప్‌ 10లో స్థానం సాధించాలని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రణాళిక బద్ధంగా పదో తరగతి విద్యార్థులపై అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్కూళ్లతో పాటు కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లల్లో సైతం ఈ ఏడాది ఆశించిన స్థాయి లో ఫలితాలు రాకపోవడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన టె న్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలు గురువారం విడుదల చేశారు. టెన్త్‌కు సంబంధించి 905 మందికి 357 మంది, ఇంటర్మీడియట్‌లో 2,322మందికి 1,660 మంది ఉత్తీర్ణత సాధించారు.

బాలికలదే హవా

జిల్లాలో విడుదలైన పది ఫలితాల్లో 83.93 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 26,492 మంది హాజరుకాగా 22,235 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 13,938 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా ఇందులో 11,366 మంది ఉత్తీర్ణులై 81.55 శాతం సాధించారు. అలాగే 12,554 మంది పరీక్ష రాయగా ఇందులో 10,869 మంది ఉత్తీర్ణత సాధించి 86.58 శాతంతో మళ్లీ జిల్లాలో తమ సత్తా చాటారు. గత ఏడాది 26,679 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 21,298 మంది ఉత్తీర్ణులయ్యారు. 79.83 శాతం ఉత్తీర్ణత సాధించి 19వ స్థానం దక్కించుకుంది.

25 నుంచి సప్లిమెంటరీ

పది ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు ఈనెల 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల పరీక్ష ఫీజును శుక్రవారం నుంచి ఈనెల 9వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుంది.రీకౌంటింగ్‌ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున, రీవెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ. వెయ్యి చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈనెల 7వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్ర దేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్‌, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలకు మే 5వ తేదీ వరకు గడువు ఉందని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవా, ఏపీ అన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

సీఎం, విద్యాశాఖామంత్రి సొంత జిల్లాలో ఫలితాలపై విమర్శలు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్స్‌ వీరే

జిల్లాలోని వరదయ్యపాళెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని ఎస్‌ దిషితా సాయి 595 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీకాళహస్తి బాబు ఆగ్రహారం ఎంపీఎల్‌హెచ్‌ఎస్‌ స్కూల్‌కు చెందిన జి సాయిపూజిత 594 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే తొట్టంబేడు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పి మోహిత్‌ చరణ్‌సాయి 591 మార్కులు సాధించగా వరదయ్యపాళుం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కే రేఖ 591 మార్కులతో ఇద్దరు మూడో స్థానంలో నిలిచారు. తి రుపతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జి నిహారిక 590 మార్కులు సాధించి 4 స్థానంలో నిలిచింది. అలాగే నెరబైలు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మాధురి 590 మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది 4.10 శాతం ఎక్కువ ఉత్తీర్ణత

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 4.10 శాతం ఎక్కువ గా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడా ది 79.83 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జి ల్లాకు 19వ స్థానం దక్కింది. అలా గే ఈ ఏడాది 83.93 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే 20 స్థానంలో జిల్లా నిలిచింది. 2026–27కు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈనెల 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నాం.

–కేవీఎన్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి

సాక్షాత్తు సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్‌ సొంత జిల్లా తిరుపతిలో పది ఫలితాలు దారుణంగా పడిపోవడంపై జిల్లా వ్యాప్తంగా విద్యావేత్తలు, తల్లిదండ్రులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని, కనీసం జిల్లాపై మంత్రి ప్రత్యే క శ్రద్ధ తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్లుగా పది, ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా ఆశించిన స్థానాన్ని దక్కించుకోకపోవడం గమనార్హం. అధికారులు 100 రోజుల ప్రణాళిక పేరుతో హంగామా చేసి నా ఆశించిన ఫలితాలు దక్కలేదనే విమర్శలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement