తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు గత నెల 16 నుంచి ఈనెల 2వ తేదీ వరకు జరిగాయి. ఈ క్రమంలో అధికారులు మూల్యంకనంపై ఫోకస్ పెట్టారు.సోమవారం నుంచి ఈనెల 15వతేదీ వర కు టెన్త్ స్పాట్ వ్యాల్యుయోషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. తిరుచానూరు జెడ్పీ హైస్కూల్‌లో మూల్యంకనం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజులో 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో విధుల కేటాయింపు
మూల్యాంకన ప్రక్రియకు విధులు నిర్వహించాల్సి ఉపాధ్యాయుల ఎంపిక ప్రకియను ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టారు. జిల్లాకు మొత్తం 1,83,515 జనా బు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. అందుకు వివిధ హోదాల్లో 1002 మందికి డ్యూటీ లు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేపర్లు దిద్దేప్రక్రియ ఉంటుంది. ఆ మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుమార్లు డీఈఓ కేవీఎన్ కుమార్ మూ ల్యాంకన కేంద్రాన్ని పరిశీలించారు. అయితే డ్యూ టీల కేటాయింపులో తిరుపతితోపాటు సమీ ప ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయుల కన్నా గూడూరు ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను అధికంగా నియమించారు. దీంతో వారంతా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పద్ధతికి శ్రీకారం
ఈ ఏడాది టెన్త్ మూల్యాంకణానికి సంబంధించి 350 ట్యాబ్‌లను వినియోగించనున్నారు. ఉపాధ్యాయుడు మూల్యాంకణం సందర్భంగా మార్కులను ట్యాబ్‌ల ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది.
నేటి నుంచి సమ్మేటీవ్–2
పదో తరగతి పరీక్షల సమయంలోనే 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వారికి పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సోమవారం నుంచి సోమవారం మొదలుకానున్నాయి. 1–5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6, 7, 8, 9, 10వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అలాగే 6–8వ తరగతి పిల్లలకు సోమవారం నుంచి ఈ నెల 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 6, 7, 8, 9, 10, 11, 13, 15, 16తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.


