బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

బరితెగింపు

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

భారీ యంత్రాలతో చదును పనులు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన అక్రమాలు

కబ్జాకోరులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌ అధికారులు

అటవీ ప్రాంతంలో చదును పనులు చేస్తున్న హిటాచీ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించేశారు. ఇన్నాళ్లు ఇసుక, గ్రావెల్‌పై పడిన పచ్చ నేతలు, ఇప్పుడు రిజర్వ్‌ ఫారెస్టుపై కన్నేశారు. నకిలీ పత్రాలను సృష్టించి, హిటాచీలను పెట్టి ఏకంగా అటవీ భూమి ఆక్రమణకు తెగబడ్డారు. వివరాలు.. రామచంద్రాపురం–చంద్రగిరి సరిహద్దులో కురప్ప కణం రిజర్వ్‌ ఫారెస్టు ఉంది. అందులో కొంత భూమిని చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన టీడీపీ నేత కామసాని రూపసుందర్‌ రెడ్డి ఆక్రమించుకున్నారని అదే పార్టీకి చెందిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. హిటాచీలతో భూమి చదును చేయిస్తున్న దృశ్యాలను అప్‌లోడ్‌ చేశారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆ వీడియో మండిపడ్డారు. విలువైన అటవీ సంపదను ధ్వంసం చేయడంతో పాటు దశలవారీగా గుట్టలను చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నాడని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోరాడు.

అర్ధరాత్రి దాడులు..!

టీడీపీ నేత సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై అట వీ అధికారులు స్పందించారు. శుక్రవారం అర్ధరాత్రి అడవిని ఆక్రమించుకుంటున్న ప్రాంతానికి చేరుకున్నా రు. పనులను అడ్డుకోవడంతో పాటు ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేత రూప సుందర్‌ రెడ్డి, ఆయన కుమారుడు రేవంత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని, తిరుపతిలోని అటవీ కార్యాలయానికి తరలించారు.

నకిలీ పత్రాలను సృష్టించి..

టీడీపీ నేత రూపసుందర్‌ రెడ్డి నకిలీ పత్రాలను సృష్టించి, దొడ్డిదారిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు తర్వాత ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు వెల్లడిస్తుండడం గమనార్హం.

అటవీ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతలు

విచారణ చేపట్టాం

రామచంద్రాపురం మండలం కురప్ప కణం అటవీ ప్రాంతంలో ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతో దాడులు చేశాం. పనులను అడ్డుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. అయితే ఆ భూమికి సంబంధించి డీకేటీ పట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపై విచారణ చేపట్టాం.

– రమేష్‌ బాబు, ఎఫ్‌ఎస్‌ఓ, చంద్రగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement