విద్యుత్తు సరఫరాలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్తు సరఫరాలో అలసత్వం వద్దు

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

తిరుపతి రూరల్‌: సదరన్‌ డిస్కం పరిధిలో విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందించాలని, సరఫరాలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని డిస్కం సీజీఎం క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. గత రెండు రోజులుగా శ్రీకాళహస్తి, మదనపల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డయల్‌ యువర్‌ సీఎండీకి వస్తున్న ఫిర్యాదుల్లో విద్యుత్తు అంతరాయంపై అధికంగా వస్తున్నాయని ఇకపై ఆ పరిస్థితి ఉండరాదన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదన్న ఫిర్యాదు వినియోగదారుల నుంచి వస్తే ఎంతటి వారైనా ఇబ్బందులు పడకతప్పదన్నారు. అనంతరం 33కేవీ/11కేవీ విద్యుత్తు సబ్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. విద్యుత్తు సబ్‌ స్టేషన్లలో ఏదేనీ మరమ్మతులు వుంటే వెంటనే సరిచేసుకోవాలని, వేసవిలో అధికంగా వినియోగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement