తిరుపతి కల్చరల్ : బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్యభవన్‌లో శుక్రవారంఅభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, నేత సాకం నాగరాజు మాట్లాడుతూ తిరుపతిలో మే 23 నుంచి రెండు రోజుల పాటు మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు దశాబ్దాల అనంతరం తిరుపతి వేదికగా మహాసభలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. అరసం తిరుపతి, చిత్తూరు జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న, గంటా మోహన్, పల్లిపట్టు నాగరాజు, ఉపాధ్యక్షుడు గోవిందయ్య పాల్గొన్నారు.


