స్పష్టమైన లక్ష్యానికి నిరంతర సాధన అవసరం | - | Sakshi
Sakshi News home page

స్పష్టమైన లక్ష్యానికి నిరంతర సాధన అవసరం

Mar 27 2026 9:48 AM | Updated on Mar 27 2026 9:48 AM

తిరుపతి సిటీ:విద్యార్థులు స్పష్టమైన జీవిత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకోసం నిరంతర సాధన చేయాలని వీసీ ప్రొఫెసర్‌ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఫిజిక్స్‌ విభాగంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహకారంతో విద్యార్థులకు వారం రోజులపాటు అందిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు భాష, వ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. తద్వారా ఉన్నత ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫిజిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ దేవ ప్రసాదరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కౌటిల్య సంస్థ డైరెక్టర్లు శామ్యూల్‌ రెడ్డి, శ్రీధర్‌ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కాలానుగుణమైన నైపుణ్యాలు అవసరమన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ లోకనాథం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా అధికారులు సులేమాన్‌, సునేష్‌, స్కిన్‌ డెవలప్మెంట్‌ ట్రైనర్‌ దీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement