ఘనంగా ‘అమర’ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘అమర’ వార్షికోత్సవం

Mar 9 2026 7:45 AM | Updated on Mar 9 2026 7:45 AM

రేణిగుంట: మండలంలోని కరకంబాడి సమీపంలో ఉన్న అమర హాస్పిటల్‌ 5వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ గౌరినేని, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమాదేవి గౌరినేని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ప్రసాద్‌, రమాదేవి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ రోగులకు మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను సైతం త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకు 7699108108 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. వైద్యులు రవికుమార్‌ రెడ్డి, లోకేష్‌ రెడ్డి, వరుణ్‌, వాసుదేవ రెడ్డి, ముని కృష్ణ, విజయేంద్ర రెడ్డి, బేబీ షాలిని, అశోక్‌ రెడ్డి, వెంకట శివ కృష్ణ, సీఓఓ భాగ్యలక్ష్మి, సీబీఓ వేణుగోపాల్‌, మునినాథ, హేమ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement