ఇండియన్ బ్యాంక్ నుంచి టీటీడీకి విరాళం
తిరుమల: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేశ్‌కుమార్ రూ. 37,97,508 విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కలసి విరాళం డీడీని అందజేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలిపిరి చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం విరాళం అందజేసినట్లు తెలిపారు.
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
హైదరాబాద్ కు చెందిన హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే ఫ్లాష్‌లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు వారి ప్రతినిధి కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలో అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
ఇండియన్ బ్యాంక్ నుంచి టీటీడీకి విరాళం


