మోహిత్ రెడ్డిని అభినందించిన అధినేత
– చంద్రగిరిలో లక్షా 16 వేల సంతకాల సేకరణపై ప్రశంసలు
తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అభినందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం చంద్రగిరిలో చరిత్ర సృష్టించిందని, సీఎం చంద్రబాబు పుట్టి, పెరిగిన నియోజక వర్గంలోనే లక్షా 16 వేల మంది సంతకం పెట్టినట్టు తెలుసుకున్న ఆయన శభాష్ అంటూ ప్రశంసించారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీసిన జగన్ ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతానన్నారు.


