వక్తృత్వ పోటీ విజేత తిరుపతి
తిరుపతి రూరల్ :ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో కడప జిల్లా విద్యార్థులు, వక్తృత్వ పోటీల్లో తిరుపతి విద్యార్థి విజేతలుగా నిలిచారని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తిరుపతి,చిత్తూరు, నెల్లూ రు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంధన పరిరక్షణ అంశంపై జిల్లా స్థాయిల్లో క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. జిల్లాల పరిధిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయా జిల్లా కార్యాలయాల ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి బుధవారం సాయంత్రం ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహించారు.
వక్తృత్వపు పోటీల్లో ..
ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వపు పోటీల్లో తిరుపతి జిల్లా గూడూరులోని సీఎస్‌ఎం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జె. అద్రిజారావు మొదటి స్థానంలో నిలువగా, చిత్తూరు జిల్లా పైపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే. మనీషా ద్వితీయ స్థానం, అనంతపురం జిల్లాలోని లక్ష్మి సినర్జీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న టి. యశస్విని తృతీయ స్థానంలో నిలిచారు. సంస్థ డైరెక్టర్ (టెక్నికల్ – హెచ్‌ఆర్ డి) కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆది శేషయ్య, పి.హెచ్. జానకిరామ్, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 20, 21న రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందించనున్నట్టు సీఎండీ తెలిపారు.


