ఐఐటీలో ఉత్కంఠగా పోటీలు
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చెస్, టెన్నీస్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
చెస్ 4వ రౌండ్ ఫలితాలివే
చెస్ పోటీలలో నాల్గవ రౌండ్ ముగిసే సరికి ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థులు 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాలలో 11 పాయింట్లతో బాంబే ఐఐటీ, 10 పాయింట్లతో ఇండోర్, కాన్పూర్ ఐఐటీలు, 9.5 పాయింట్లతో వారణాసి, మద్రాస్, గౌహతి ఐఐటీలు, 9 పాయింట్లతో పాట్నా ఐఐటీ, 8.5 పాయింట్లతో హైదరాబాద్, బిలాయ్, భువనేశ్వర్ ఐఐటీలు కొనసాగుతున్నాయి. టెన్నీస్ మహిళలు, పురుషుల విభాగాలలో క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి.
ఐఐటీలో ఉత్కంఠగా పోటీలు


