తుపాను దెబ్బతీసింది
ఈ చిత్రంలో ఉన్న రైతు చిల్లకూరు వేమయ్య, తనకు ఉన్న మూడెకరాలలో ఒక ఎకరం నిమ్మ సాగు చేపట్టాడు. సీజన్‌లో నిమ్మ కాయలు కోసి విక్రయించుకుంటే ఇంటి ఖర్చులు పోను రెండెకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు సాగుకు అవసరమైన ఖర్చులకు సరిపోయేవి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నిమ్మ కాయలు బాగా కాస్తున్నప్పటికీ ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాగుకు అవసరమైన మందులు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు తుపాను సమయంలో నిమ్మ పూత రాలి పోవడంతో వేసవిలో కాయలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.


