మాకు కడుపు కోత మిగిల్చారు
నాయుడుపేటటౌన్: పట్టణంలోని మూకాంబికా వీధిలో నివాసం ఉన్న దివ్యాంగుడు తుమ్మూరు శ్రీనివాసులు. అతని భార్యపేరు విజయ. 2017 కంటే ముందు బ్రెయిన్ స్ట్రోక్‌తో శ్రీనివాసుల పరిస్థితి విషమంగా మారి రెండు కాళ్లు, చేతులు పని చేయక మంచానికి పరిమితమయ్యారు. వంద శాతం వైకల్యం ఉన్న శ్రీనివాసులుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం మంచానికే పరిమితమై రెండు కాళ్లు, చేతులు పనిచేయని శ్రీనివాసులుకు 40 శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు జారీ చేసి పింఛన్‌ను రద్దు చేశారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నోటీసులు ఇచ్చారు. దీంతో నడవలేనిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు నానా ఇబ్బందులు పడి తిరుపతి వైద్యశాలకు తీసుకెళ్లారు. అయినా సదరన్ సర్టిఫికెట్ అందలేదు. పింఛన్ రద్దు చేసి మాకు కడుపు కోత మిగిల్చారని ఆవేదన చెందుతున్నారు.


