ప్రైవేటీకరణపై విద్యార్థి రణం
జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా సంతకాలు చేసిన విద్యార్థులు
చంద్రబాబు సర్కార్‌ను వ్యతిరేకిస్తూ గళం విప్పిన విద్యార్థి లోకం
జిల్లాలో 4 లక్షలు దాటిన విద్యార్థుల సంతకాలు
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ కలాలు గళాలుగా మార్చి విద్యార్థిలోకం రణం మొదలు పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు తమదైన పాత్ర పోషించి, సంతకాలతో తమ గళం వినిపించారు. జిల్లాలోని విద్యార్థులు లక్షలాది మంది తమ సంతకం చేసి, నిరసన తెలిపారు.
తిరుపతి సిటీ: జిల్లా యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిపై గళమెత్తారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులే సుమారు 4 లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కార్‌పై యువత ఎంత ఆగ్రహంగా ఉందో తెటతెల్లమవుతోంది. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు సర్కార్ వైద్యవిద్యను గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర పన్నుతోందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వైద్య కళాశాలల
ప్రైవేటీకరణపై తిరుగుబాటు
జిల్లాలో సంతకాల వివరాలు
నియోజకవర్గం మొత్తం సంతకాల సేకరణ విద్యార్థులు చేసిన సంతకాలు
తిరుపతి 60, 432 24,221
చంద్రగిరి 1, 16,017 61,327
శ్రీకాళహస్తి 75,776 21,658
వెంకటగిరి 72,487 19,423
సూళ్లూరుపేట 69,544 17,557
గూడూరు 70,551- 18,674
సత్యవేడు 51,508 16,700
ప్రైవేటీకరణపై విద్యార్థి రణం


