వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతకు పలు అభిషేకాలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం పుర ఉత్సవం నిర్వహించారు.
స్కిల్ ఇండియా స్టేట్ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీడబ్ల్యూ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన స్కిల్ ఇండియా కాంపిటేషన్ పోటీల్లో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 85 మంది విద్యార్థులు పోటీ పడగా ఇందిలో 9 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణించారు. విజయవాడ కేంద్రంగా ఈనెల 19వ తేదీన జరగనున్న స్టేట్ లెవల్ కాంపిటేషన్‌లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ స్టేట్ లెవల్ కాంపిటేషన్‌కు ఎంపికై న 9 మంది విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆ కాంక్షించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ దీప పాల్గొన్నారు.
నైలెట్‌తో కలసి
నూతన కోర్సులు
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)తో కలిసి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగా నూతన కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్వీ ఆ ర్ట్స్ కళాశాల్లో విద్యార్థుల కోసం నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యవృద్ధి కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైలెట్ అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రతి సంవత్సరం పరిశ్రమ ల అవసరాలకు అనుగుణమైన నూతన కోర్సు లను ప్రవేశపెట్టేందుకు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నైలెట్‌తో త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రధానంగా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణకు ప్రాఽ దాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగాధిపతి మల్లికార్జున రావు, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి రత్నరావు, అధ్యాపకులు చక్రవర్తి పాల్గొన్నారు.
మహిళా హాస్టళ్లలో
సెల్ ఫోన్ల చోరీ
తిరుపతి క్రైం : నగరంలోని మహిళా హాస్టళ్లలో సెల్‌ఫోన్లు చోరీకి పాల్పడిన సంఘటన బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు కథనం మేరకు.. భవానీనగర్ సమీపంలోని ఫ్రెండ్స్, మహిత్ ఉమెన్స్ హాస్టల్‌లోకి బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ము సుగు దొంగ చొరబడి ఆరు సెల్ ఫోన్లను చోరీ చేశాడు. దీనిపై మహిళా హాస్టళ్లలోని విద్యా ర్థులు ఈస్ట్ పోలీసులు సంప్రదించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముంపు బాధితులకు
ఫ్యాన్ల వితరణ
వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో రాయలచెరువు వరద ప్రవాహానికి ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ముంపు బాధితులకు ఫ్యాన్ల వితరణ కార్యక్రమం కొనసాగుతోంది. మొదటగా కళత్తూరు పంచాయతీలో 500 కుటుంబాలకు ఫ్యాన్ల వితరణ చేశారు. అయితే ముంపు బాధిత గ్రామాలు పాతపాళెం, దళితవాడ, అరుంధతివాడలో కూడా నీటి ప్ర వాహం సంభవించి నష్టం వాటిల్లడంతో ఆ రెండు గ్రామాలకు చెందిన 75 కుటుంబాలకు బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సూచనల మేరకు ఫ్యాన్లను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గవర్ల కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ సుకన్య, నేతలు హరిబాబు, ప్రవీణ్‌కుమార్, శివప్రసాద్ వర్మ, వెంకటరమణ, మోహన్‌రాజు, జయరాం, వెంకటేష్ పాల్గొన్నారు.
వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం
వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం


