రాష్ట్ర గవర్నర్ కు సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రవికుమార్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా
గాలి శ్రీనివాసులు
తిరుపతి లీగల్: తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయ వాది గాలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం బు ధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు న్యాయవా ది గాలి శ్రీనివాసులు తెలిపారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. ఆయన తిరుపతిలో 25 ఏళ్ల పైగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ న్యాయవాది దొరైరాజ్ వద్ద ఆయన జూనియర్ న్యాయవాదిగా విధులు ప్రా రంభించాడు. ఆయన నియామకంపై రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు జి.సుదర్శన్ రావు, న్యాయవాదు లు దేశిరెడ్డి భాస్కర్ రెడ్డి, దేవరాజులు, తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
రాపూరు: మల్లమ్మగుంట సమీపంలోని కొండేరువాగు వద్ద బుధవారం మృతదే హం ఉన్నట్లు స్థానికులు పో లీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ వెంకటేశ్వరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. ఏఎస్‌ఐ కథనం మేరకు.. గూడూరు మండలం తిరుపతిగారిపల్లి గ్రామానికి చెందిన సుందరయ్య(79) ఈనెల 14వ తేదీ ఇంటి సమస్యలతో ఇల్లు వదిలి వెళ్లాడు. మల్లమ్మగుంట వద్ద ఉన్న వాగు సమీపంలో మృతి చెందాడు. మృతదేహం పక్కన పురుగుల మందు ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్న ట్లు తెలిపారు. మృతిని ఫొటోను చూసి, వారి బంధువులు ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ కు సాదర వీడ్కోలు
రాష్ట్ర గవర్నర్ కు సాదర వీడ్కోలు


