లైంగిక వేధింపుల పరిష్కారంపై అవగాహన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, పరిష్కారం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ వర్సిటీలో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల భద్రత కోసం కృషి చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తిరుపతి ఉమెన్ ఇనిషియేటివ్ పర్సన్ మీరా రాఘవేంద్ర, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, ఐసీసీ సభ్యురాలు డాక్టర్ శ్వేత, ఉమెన్ సెల్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ ఆర్‌జే రమాశ్రీ, డాక్టర్ జి నాగలక్ష్మి పాల్గొన్నారు.
సీనియర్ సిటిజెన్‌ని బెదిరించిన సైబర్ నేరగాళ్లు
తిరుపతి క్రైం:నగరంలో నివాసం ఉంటున్న ఓ సీనియర్ సిటిజెన్‌ను సైబర్ నేరగాళ్లు బెదిరించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ యూని వర్సిటీ పోలీసుల కథనం మేరకు.. నగరంలో నివాసం ఉంటున్న 66 సంవత్సరాల వృద్ధుడికి సీబీఐ అధికారులంటూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. మీరు మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీపై బెంగళూరులో కేసు నమోదైందని తెలిపాడు. అనంతరం వీడియో కాల్ చేసి, ఇంట్లో ఎవరికీ తెలపొద్దని గదిలో కెళ్లి మాట్లాడాలని సూచించాడు. ఆ వృద్ధుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అతని అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నింటిని తెలుసుకున్నారు. వెంటనే ఆ వృద్ధుడు ఆర్టీజీఎస్ ద్వారా రూ.40 లక్షలను వీరికి పంపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆర్టీజీఎస్ పంపించేందుకు ఇస్కాన్ బ్రాంచ్‌లోని ఎస్‌బీఐ సిబ్బందిని సంప్రదించాడు. వారు ఎందుకు పంపించాలని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తెలిపారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనేనని, దీనిపై మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు సంప్రదించాలన్నారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తతతో సైబర్ మోసం తప్పింది. బ్యాంకు సిబ్బందిని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు స్టేషన్ కు పిలిపించి వారిని ఘనంగా సత్కరించారు.
లైంగిక వేధింపుల పరిష్కారంపై అవగాహన


