అధ్యాపక పోస్టులు తక్షణం భర్తీ చేయాలి
తిరుపతి సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామన్ ఎంట్రెనన్స్ పీజీ సెట్ విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. ఎస్వీయూ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించకపోవతే యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీ నాయకులు చిన్న, నగర అధ్యక్ష ,కార్యదర్శులు హరికృష్ణ, వినయ్ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్, నాయకులు వెంకటేష్, అశోక్, నాని, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.


