బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
పెళ్లకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, ఒక్కమాట కూడా నిజం ఉండదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.21లక్షల వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామంటూ బహిరంగ వేదికల్లో భీకరాలు పలకడం అమానుషమన్నారు. తెచ్చిన పెట్టుబడులను ఎక్కడ పెట్టారు, ఏమి చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసం ఉందన్నారు. పచ్చరోత పత్రికల్లో లేని జీడీపీని చూపించి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కేంద్రం నుంచి వచ్చే రూ.10 వేల కోట్ల నిధులు రాకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రోజుకు రూ.475 కోట్లు చొప్పున 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లు అప్పు తెచ్చిన హీనచరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో మంజూరైన 17మెడికల్ కాలేజ్‌లను పూర్తి చేస్తే జగన్‌మోహన్‌రెడ్డిని పేరు వస్తుందనే నెపంతో పీపీపీ విధానం అంటూ రూ.100కు బినామీలకు దోచి పెడుతున్నాడని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్‌లను అమ్మి ముడుపులను కరకట్టకు పంపడమేనా? అని ఎద్దెవా చేశారు. ఆయన వెంట నాయకులు వెంకటాచలం, శంకరయ్య, బత్తెయ్య, సునీల్ ఉన్నారు.


