ముగిసిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృ వర్సిటీలో రెండు రోజులగా జరిగిన రాష్ట్రస్థాయి సంస్కృత వక్తృత్వ, సాహిత్య పోటీలు మంగళవారంతో ముగిశాయి. వాగ్వర్థిని పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సంస్కృత పోటీల్లో భాగంగా 36 విభాగాల్లో పోటీలను నిర్వహించామన్నారు. ఇందులో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, డీన్ రజినీకాంత్ శుక్లా, వాగ్వర్థిని కోఆర్డినేటర్లు డాక్టర్ భరత్ భూషణ్ రథ్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయన హెగ్డే పాల్గొన్నారు.


