పోరాటం ఉధృతం చేస్తాం
తిరుపతి అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు కోటిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేమాలయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6వ తేదీన సొసైటీల వద్ద, 8వ తేదీన బ్రాంచ్ కార్యాలయాల వద్ద, 16న కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టామని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 22న చిత్తూరు డీసీసీబీ వద్ద ధర్నా చేస్తామని, ఈ నెల 29న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.


