కానిస్టేబుల్ పోలీసుశాఖకు వెన్నెముక
– జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి క్రైం: కానిస్టేబుల్ అనేది పోలీస్ శాఖకు వెన్నెముక లాంటిదని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణకు హాజరైన 138 మంది అభ్యర్థులతో సోమవారం ఎస్పీ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సమావేశమయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి, శారీరక పరీక్షలు, రాత పరీక్షలు తదితర అన్ని దశలను దాటు కుని ఈ స్థాయికి వచ్చారని అభినందించారు. ఇది సులభంగా లభించిన అవకాశం కాదని, మీ అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం లభించిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడకు వెళ్లే అభ్యర్థుల బస్సులను జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.


