మఠం భూమిలోకి బయటి వ్యక్తులు రాకూడదు!
తిరుపతి రూరల్: మండలంలోని గాంధీపురం పంచాయతీ అవిలాల సర్వే నంబర్ 13లోని మఠం భూమిలో ఆక్రమణలు కొనసాగుతున్నందున గొడవలు జరుగుతున్నాయని సాక్షి దినపత్రికలో సోమవారం ‘కబ్జాల రాజ్యం!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీసులు మఠం భూమిలోకి బయటి వ్యక్తులు ఎవరు రాకూడదని హుకుం జారీ చేశారు. అలాగే స్థానికులు కూడా అకారణంగా ఎవరితో గోడవలు పడకూడదని, ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులకు తెలపాలని సూచించారు. అలాగే మఠం భూముల్లో అక్రమ నిర్మాణాల విషయంగా గత రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కారకులైన 30 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినట్టు సమాచారం.


