● కోట మండల వాసిగా గుర్తింపు
వ్యక్తి ఆత్మహత్య
చిల్లకూరు: గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన్నట్లు స్థానికులు గుర్తించి, సోమవారం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గూడూరు రూరల్ ఎస్‌ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కోట మండలం నెల్లూరుపల్లికి చెందిన దాసి సుబ్బయ్య(40) అనే వ్యక్తి వరికోత మిషన్లు తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేకువ జామున ఈ ప్రాంతానికి బైక్‌పై వచ్చి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆయన సెల్‌ఫోన్ ఆదారంగా వివరాలు తెలుసుకుని, వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తిరుమలను వణికిస్తున్న చలి
తిరుమల:చలి తీవ్రతకు శాలువలు,స్వెట్టర్లు ధరించి వెళుతున్న భక్తులు ఆధ్యాత్మి క పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఎన్నడు లేని విధంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో భక్తుల తిరుమలలో బెడ్ షీట్లు, స్వెట్టర్లు కప్పుకుని వెళుతున్నారు. రూములు దొ రకని భక్తులు వెయిటింగ్ హాల్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉండిపోతున్నా రు. రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే తిరుమలలో కనిష్టంగా 20 డిగ్రీల వరకు ఉంటుంది.
● కోట మండల వాసిగా గుర్తింపు
● కోట మండల వాసిగా గుర్తింపు


