మార్కెట్ లోకి ‘స్మైల్ ఎకో‘ ఉత్పత్తులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉత్పత్తులను మొట్టమొదటగా సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి లాంఛనంగా కంపెనీ ఆవరణలో ఉత్పత్తుల వాహనాన్ని ప్రారంభించారు. వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్‌కిన్స్) తయారు చేసే ఈ కంపెనీ ఈ ఏడాది 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి చేతుల మీదుగా ప్రారంభమైంది. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని తొలుత సుమారు రూ.10 లక్షల విలువచేసే తొలి ఉత్పత్తులను విజయవాడకు పంపింది. స్మైల్ ఎకో ఉత్పత్తులు మార్కెట్‌కు విడుదలపై కంపెనీ ఎండీ, సిబ్బందికి నిరీషా సన్నారెడ్డి అభినందనలు తెలిపారు.


