వైఎస్సార్ సీపీలోకి టీడీపీ యువ నేత
శ్రీకాళహస్తి: పట్టణంలోని 29వ వార్డుకు చెందిన టీడీపీ యువ నాయకుడు మణికంఠ సోమవారం వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మణికంఠకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసే నాయకులకు వైఎస్సార్ సీపీలో ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మణికంఠ నిబద్ధతగల యువ నాయకుడని, అతని సేవలను పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని తెలిపారు. మణికంఠ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో 29వ వార్డులో వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన శాయిశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు గిరిధర్ రెడ్డి, ఆర్కాడు ముత్తు, శంకర్ పాల్గొన్నారు.


