త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
రేణిగుంట: వేగంగా వచ్చిన మెట్రో బస్సు ముందు వెళుతున్న కారును ఢీకొనడంతో కారు పక్కనే పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్ర మాదం తప్పింది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళు తున్న ఆర్టీసీ మెట్రో బస్సు రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ముందు వెళుతున్న కారును వేగంగా ఢీకొట్టడంతో ముందున్న ద్విచక్ర వాహన మెకానిక్ షాపు వద్ద పార్కింగ్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాల పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. సంఘటన స్థలానికి అర్బన్ పోలీసులు చేరుకుని ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్‌కి తరలించి, విచారిస్తున్నారు.


