ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరసింహయ్య
తిరుపతి కల్చరల్ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఐ.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా జి.సాయికృష్ణ, ఉపాధ్యక్షుడిగా తిరునగరు శశికళ, ప్రధాన కార్యదర్శిగా ఎల్.గంగాధర్‌ను ఎంపిక చేసిట్లు పేర్కొన్నారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కమిటీ ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూరేలా పనిచేస్తామని తెలిపారు.


