 
															కోడూరుపై కేసు నమోదు చేయాలి
తిరుపతి మంగళం : టీటీడీ పరకామణిలో అవకతవకలకు పాల్పడిన రవికుమార్ ఆస్తులకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై ఇష్టమొచ్చినట్లు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టిన టీడీపీ నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యంపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు భూమనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన కోడూరు బాలసుబ్రమణ్యంపై కూడా ఇటీవల తమ పార్టీ నాయకుడు నవీన్ బృంగీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడని పెట్టిన కేసులనే, ఆయనపై కూడా పెట్టి, ముఖానికి ముసుగు వేసి మీడియా ముందు నిలబెట్టాలని సీఐకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఒకలా, టీడీపీ నాయకులను మరొకలా చూడకుండా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో వాసుయాదవ్, పార్టీ నాయకులు మల్లం రవికుమార్, దినేష్‌రాయల్, మాకం చంద్రయ్య, డిష్ చంద్ర, పసుపులేటి సురేష్, కోటి, చింతా రమేష్ ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
