 
															253 మంది ఎంబీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
చంద్రగిరి: మోహన్‌బాబు యూనివర్సిటీలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూల్లో వర్సిటీకి చెందిన 253 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గురువారం ప్రముఖ సీజీఎస్ (కాగ్నిజంట్ టెక్నాలజీ సర్వీస్) కంపెనీ ప్రతినిధులు ఎంబీయూలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో వర్సిటీకి చెందిన సుమారు 253 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికై నట్లు యూనివర్సిటీ కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఢిల్లీబాబు తెలిపారు. ఈ సందర్భంగా చాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు, ప్రోచాన్సలర్ మంచు విష్ణుతోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వీసీ నాగరాజ్ రామారావు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ సారథి, ఫైనాన్స్ డైరెక్టర్ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
