చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

Oct 24 2025 8:03 AM | Updated on Oct 24 2025 8:03 AM

చేపల

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

దొరవారిసత్రం: వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గ ల్లంతయ్యారు. వివరాల్లో కి వెళితే.. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన మేకల పోలయ్య(31) కాళంగి నదిలో కాలనీ వాసులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు జారిపడి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన తనియాలి పంచాయతీ కమ్మకండ్రిగ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేక్షపాత్ర వహించారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నారు.

చల్లకాలువలో వ్యక్తి గల్లంతు

కోట: చేపల వేటకు వెళ్లి వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతైన సంఘటన కర్లపూడిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పవన్‌కుమార్‌ కథనం మేరకు.. కర్లపూడి గిరిజన కాలనీకి చెందిన మానికల పోలయ్య(75) బుధవారం సాయంత్రం స్వర్ణముఖి చల్లకాలువలో చేపటవేటకు వెళ్లాడు. పొద్దుపోయిన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా కనిపించకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం తహసీల్దార్‌ జయజయరావు, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసులు తమ సిబ్బందితో వెళ్లి చల్లకాలువలో బోట్ల సాయంతో తీవ్రంగా గాలింపు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదు. చీకటిపడడంతో గాలింపు నిలిపివేశారు. పోలయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎట్టకేలకు పీజీ ఫలితాలు విడుదల

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎంఏ, ఎమ్మెస్సీ పరీక్షలకు సంబంధించి పలు సెమిస్టర్‌ల ఫలితాలు ఎట్టకేలకు వర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫలితాల విడుదలపై ఇప్పటికే పలుసార్లు అధికారులను విద్యార్థులు నిలదీయడంతోపాటు నిరసనలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం పరీక్షల విభాగం అధికారులు, ఉద్యోగులతో నూతన వీసీ సమావేశం ఫలితాల ప్రకటనలపై ఆరా తీశారు. దీంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు పీజీ మూడో సెమిస్టర్‌కు సంబంధించి పలు కోర్సుల ఫలితాలను ప్రకటించారు. దీంతో విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్టైంది.

బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

శ్రీకాళహస్తి: రాష్ట్రస్థాయిలో జరిగే 17 బ్యాడ్మింటన్‌ బాలబాలికల జుట్లకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జునరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్నంలోని దర్శ బ్యాండ్మిటన్‌ అకాడమిలో ఈ పోటీలు జరిగాయి. 150 మంది క్రీడాకారులు చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక పోటీలకు హాజరయ్యారు. బాలుర జట్టుకు కార్తీక్‌, ఏ ప్రణవ్‌, హెచ్‌ కార్తీక్‌, ఎస్‌కే ప్రణీత్‌, కే పుష్కర్‌ను ఎంపిక చేశారు. బాలికల జట్టులో బి జీవిత, పి శరణ్య, ఎస్‌ సువర్ణాంజలి, హెచ్‌ యుగభారతి, ఎం షష్టిని ఎంపిక చేశారు. ఈ పోటీలు తిరుపతి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి కిషోర్‌ కుమార్‌, భార్గవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పీడీలు హేమకుమార్‌, భక్తగోపాల్‌, వినోద్‌, బాబు, జేమ్స్‌, రమణ, సురేంద్ర, నిరంజన్‌, లోకనాథం, కిరణ్‌, చంగల్‌ రాయులు, గోపి, క్రాంతి పాల్గొన్నారు.

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు 1
1/3

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు 2
2/3

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు 3
3/3

చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement