30 వరకు ఆధార్ శిబిరాలు
– 10లో
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 30వ తేదీ వర కు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయాధికారి తెలిపారు.
కూటమి ప్రభుత్వం రాకతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం
కదంతొక్కిన విద్యార్థి లోకం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్వీయూనివర్సిటీలో విద్యార్థిలోకం గురువారం కదం తొక్కింది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాన్సర్ ఆస్పత్రికి గ్రహణం పట్టింది. అనుకున్నట్టు క్యాన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎక్కడ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందోనని శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆస్పత్రిని నిర్యీర్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రి గుర్తింపు చెరిపేసేలా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితంగా క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు మందగించాయి. చెల్లించాల్సిన బిల్లులు బ్రేక్ పడింది. ఏడాది అవుతున్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. 400 పడకలను వేర్వేరు విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం కేవలం వంద పడకలకే క్యాన్సర్ ఆస్పత్రి పరిమితమైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల మంజూరుకు టీటీడీ ఆమోదం తెలిపినా.. ప్రస్తుతం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిలా దర్శనమిస్తోంది. ఏటా 70 నుంచి 80 వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆంకాలజీ సెంటర్ నేడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాడైన పరికరాలు, అందుబాటులోని భాగాలు, సాంకేతికలోపంతో క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


