ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తిరుపతి మంగళం: వైఎస్సార్‌సీపీ నాయకులమంతా తమ ప్రాణాలైనా అర్పించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అలాగే ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి బిడ్డా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు నగదు జమ చేశారన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న సంకల్పంతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూట మి ప్రభుత్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యతోపాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చే సి, రూ.వేల కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్ర లు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి శ్ర మిస్తుంటే, చంద్రబాబు పేదల భవిష్యత్తును నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పేదలంటే చంద్రబాబుకు ఎ ప్పుడూ చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


