రేషన్ దందా
రూ. 8 లక్షలు విలువ గల 31.4 టన్నుల రేషన్ పట్టివేత
ఏడు వాహనాలు స్వాధీనం
నిందితులను పట్టుకోలేదంటున్న పోలీసులు
ఆగని అక్రమ రవాణా
బియ్యం వెనుక దొంగలు పట్టుబడేనా?
పచ్చనేతల
సాక్షిటాస్క్‌ఫోర్స్: రేషన్ మాఫియాకు పాల్పడుతు న్న కూటమి నేతలు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. లక్షల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో బుధవారం అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువగల 31.4 టన్నుల రేషన్ బి య్యం, ఏడు వాహనాలను డీఎస్పీ మహమ్మద్ స య్యద్ అజీజ్ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు.
నాలుగు నెలల కిందట..
ఈ ఏడాది జూన్ 30న ఇదే ప్రాంతంలో సుమారు 6 లక్షలు విలువ గల 13 టన్నుల బియ్యం పట్టుకు న్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నేత అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్‌ఎస్‌తోపాటు వై.ధనుష్, డి.బోస్, ఎన్.రోహిత్, వి.దినేష్, గజేంద్రన్, రాజేష్ అలియాస్ రాజు అనే వారిని అరెస్టు చేశారు.
జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేతదే
అక్రమ బియ్యం నిల్వలు రెండుసార్లు పట్టుపడిన జోర్ ఎంజాయ్ హోటల్ టీడీపీ నేత అమృతరాజ్ నాడార్‌దే అని, ఆయన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుడని నగరి పట్టణ ప్రజలు అందరికీ తెలిసి న విషయమే. అయినా పట్టుకున్న బియ్యం ఎవరిదో కనిపెట్టాలంటూ పోలీసులు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిండ్ర మండలంలోనూ అదే తంతు
ఈ నెల 14వ తేదీన నిండ్ర మండలం, అత్తూరులోను నిల్వ ఉంచిన 34 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆ కేసులోను పోలీసులు నిందితుల పేర్లు వెల్లడించకుండా నగరి పట్టణానికి చెందిన వ్యక్తి బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని మాత్రమే పేర్కొన్నారు.
అక్రమార్కులపై ప్రత్యేక నిఘా
బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ విక్రమ్ వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకొని మూతబడి ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్‌లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ, సీఐ సిబ్బందిని వెంటబెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం, వీఆర్వోతో పాటు సంబంధిత స్థలానికి చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, నాలుగు పెద్ద వాహనాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వను కొలత వేయగా 31.4 టన్నులు ఉన్నట్లు తేలింది. ఈ రేషన్ బియ్యం ఎవరెవరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అక్రమ రవాణాలో పాత్రదారులు ఎవరు అనే విషయాలు ప్రత్యేక దర్యాప్తు చేసి అందరిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్ గోదాముకు సేఫ్ కస్టడీ నిమిత్తం తరలించారు.
భారీగా పట్టివేత
సరిగ్గా 4 నెలల కాలం గడవక ముందే అదే ప్రాంతంలో గతంలో పట్టుకున్న బియ్యం కన్నా ఎక్కువగా పట్టుకున్నారు. దీంతో పచ్చనేతల రేషన్ దందా వరుసగా బహిర్గతమవుతూ వస్తోంది. అ యితే పోలీసులు పట్టుకున్న బియ్యం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది త్వరలో ప్రకటిస్తా మని చెప్పడం, విషయం ఎక్కువగా ప్రచారం కా కూడదని వివరాలను కూడా రాత్రిపూట వెల్లడించడం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ స మాచారం. అందరికీ తెలిసిన విషయమే అయి నా పార్టీకి నష్టం వాటిల్లే అంశం కావడంతో రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.
రేషన్ దందా
రేషన్ దందా


