కదంతొక్కిన విద్యార్థి లోకం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వికృత చేష్టలపై విద్యార్థి లోకం కదం తొక్కింది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్సిటీలో విద్యార్థి సంఘం నాయకు లు గురువారం పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సంతకాలు చేశారు.
స్వచ్ఛందంగా క్యూకట్టిన విద్యార్థులు
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుల పిలుపు మే రకు ఎస్వీయూలోని పీజీ విద్యార్థులు పెద్దఎత్తున కోటి సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు. స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు క్యూలో నిల్చుని సంతకాలు చేశారు. ఇందులో ప్రధానంగా వందలాది మంది మహిళా విద్యార్థులు పాల్గొని, పోటీ పడి సంతకాలు చేయడంతో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ స్థాయిలో విద్యార్థులు గళమెత్తడంతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది.
ప్రభుత్వ నిర్ణయానికి చెంపపెట్టు
రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసిన కూటమి ప్రభుత్వంపై విద్యా ర్థి లోకం తిరగబడి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములై గళమెత్తడం అభినందనీయ మని, ఇది ప్రభుత్వ నిర్ణయానికి చెంప పెట్టు అని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యవిద్యను పేదలకు దూ రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణ, పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. అలాంటి కళాశాలలను కూటమి ప్రభుత్వం లాభార్జనే ధ్యేయంగా తమ అనుచరుల చేతుల్లో పెట్టి పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు ప్రేమ్‌కుమార్, చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, విద్యార్థి విభాగం మండలాల అధ్యక్షులు నక్క హరినాథ్, శేషారెడ్డి, వెంకటరమణ నాయక్, విద్యార్థి నేతలు ముని, హరినాయక్ , లిఖిత్, సతీష్, మహేష్, నవీన్, నీరజ్ రెడ్డి, సాయి పాల్గొన్నారు.


