ప్రయాణికుల భద్రతే ప్రధానం
తిరుపతి క్రైం:ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అదనపు ఎస్పీ రవిమనోహర్ ఆచారి, డీటీఓ మురళీమోహన్ తెలిపారు. కర్నూలు ఘటన నేపథ్యంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రయివేటు ట్రావెల్స్‌ను ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయా లేదా..? గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయా లేదా..? బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్సులు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేవా అని నిర్ధారించారు. లగేజ్ కంపార్ట్‌మెంట్లలో మండే పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయోలేదో చెక్ చేశారు. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించారు. . నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో శాంతిభద్రతల ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రతే ప్రధానం


