విద్యుత్‌ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి

Oct 26 2025 6:59 AM | Updated on Oct 26 2025 6:59 AM

విద్యుత్‌ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి

విద్యుత్‌ తీగలు పట్టుకుని వ్యక్తి మృతి

చంద్రగిరి: విద్యుత్‌ తీగలు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్థరాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని తనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి తనపల్లిలోని ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కాడు. ఆపై విద్యుత్‌ తీగలను పట్టుకోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది, తలకిందులుగా వేలాడాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement